Nagarjuna Talks About Brahmastra Movie

  • 6 years ago
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అడుగుపెట్టబోతున్నారు. గతంలో శివ, క్రిమినల్ ఖుదాగవా లాంటి పలు చిత్రాల్లో నటించి హిందీ ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బ్రహ్మస్త్ర చిత్రంలో నాగార్జున నటించనున్నారు. త్వరలోనే చిత్ర బృందంతో చేరబోతున్నారు.
బ్రహ్మస్త్ర చిత్రం గురించి జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నేను బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నాను. సుమారు 15 ఏళ్ల తర్వాత హిందీ చిత్రంలో నటించడం జరుగుతున్నది. చివరిగా నేనే ఏ బాలీవుడ్ చిత్రంలో నటించానో నాకే గుర్తు లేదు. మహేష్ భట్ రూపొందించిన జఖ్మ్ చిత్రం అనుకొంటా అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
బాలీవుడ్‌లో మీ చివరి చిత్రం ఎల్‌వోసీ అని చెప్పగా.. అవును హిందీలో నా చివరి చిత్రం ఎల్‌వోసీనే. అందులో నాది అతిథి పాత్ర. జఖ్మ్ మాత్రం నేను ఫుల్‌లెంగ్త్ చేసిన పాత్ర. మహేష్‌భట్ రూపొందించిన చిత్రానికి అలియాభట్ వచ్చేది. అప్పుడు చాలా చిన్నపిల్ల అని నాగ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఎదిగిపోయింది. సమయం ఎలా గడిచిందో తెలియడం లేదు అని నాగార్జున అన్నారు.

Nagarjuna again doing a bollywood film. He said: “Yes, I am doing ‘Brahmastra‘. It is my first Hindi film in a very long time. I can’t remember when was the last time I did a Hindi film. Except Amitji (Amitabh Bachchan) with whom I’ve worked in ‘Khuda Gawah‘, they are all new to me. I’m working for the first time with Karan Johar, (director) Ayan Mukherjee, Alia Bhatt and Ranbir Kapoor.
#Nagarjuna

Recommended