Kohli Won't Score A Hundred Against Us This Summer: Cummins

  • 6 years ago
బాల్ టాంపరింగ్‌కు పాల్పడి ముగ్గురు ఆటగాళ్లు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా జట్టు అంటేనే మైండ్‌గేమ్‌కు పెట్టింది పేరు.ముఖ్యంగా ఈ జట్టులోని ఆటగాళ్లు స్లెడ్జింగ్‌‌తో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయాలని చూస్తారు. ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టి దెబ్బకొట్టడం వారు బాగా అలవాటు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు అప్పుడే రెచ్చగొట్టే, మానసిక స్థెర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సీజీ)లో ఛానల్ సెవెన్ కార్యక్రమంలో పాల్గొన్న కమిన్స్ మాట్లాడుతూ "నేను ధైర్యంగా జోస్యం చెబుతున్నా. ఆస్ట్రేలియా పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేడని అనుకుంటున్నా. వాళ్ల(భారత్)ను ఆసీస్ గడ్డపై పూర్తిగా కట్టడిచేస్తాం" అని అన్నాడు. టెస్టు క్రికెట్‌లో కోహ్లీ యావరేజి 53.4గా ఉంటే, ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ యావరేజి 62గా ఉండటం విశేషం.

Australian fast bowler Pat Cummins has made the audacious prediction that Indian maestro Virat Kohli won’t score a Test century when his side tours this summer.Even Cummins acknowledged it was a “brave, bold” call given Kohli plundered four hundreds in four Tests during India’s last outing on Australian shores in 2014/15.
#viratkohli
#hundred
#australia
#patcummins
#teamindia

Recommended