Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
అండగా నిలిచారు. తన కుమారుడికి మద్దతుగా ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. కత్తి మహేష్‌ పై బహిష్కరణ వేటుపై స్పందించిన అతడి తండ్రి కత్తి ఓబులేసు బహిష్కరణ చేయాల్సింది తన కుమారుడిని కాదని...హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. రాముడి గురించి కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమన్నారు.
ఇటీవల శ్రీరాముడి నుద్దేశించి కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడంతో ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందూమతాన్ని కించపరిచేలా ఉన్నాయని హిందూ మతపెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కత్తి మహేశ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ...శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర తలపెట్టగా...దానికి పోలీసులు బ్రేక్‌ వేశారు. మరోవైపు శ్రీరాముడిపై వ్యాఖ్యల కారణంగా కత్తిపై పలు కేసులు నమోదవడంతో పాటు అతడిపై నగర బహిష్కరణ వేటు పడింది.
కత్తి మహేష్ పై బహిష్కరణ నేపథ్యంలో ఆయన తండ్రి కత్తి ఓబులేసును మీడియా వర్గాలు స్పందన కోరగా ఆయన తన కుమారుడికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పరిపూర్ణానందస్వామిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నా కొడుకును కాదు...హిందువులను రెచ్చగొడుతున్న ఆ పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు.తన కుమారుడు రీజన్ లేకుండా మాట్లాడడని...తను మాట్లాడాడంటే ఆధారం ఉండే ఉంటుందన్నారు. అవేమిటో అడిగితే చూపిస్తారన్నారు.

Category

🗞
News

Recommended