సింధూరపువ్వు చిత్రంలో లవర్ బాయ్‌గా కనిపించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన రాంకీ చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన RX 100 అనే చిత్రంలో నటించారు. కథ, పాత్ర నచ్చడంతోనే ఈ చిత్రంలో భాగమయ్యానని ఆయన తెలిపారు. టెక్నికల్‌గా ఈ చిత్రం బ్రహ్మండంగా ఉంటుందని రాంకీ వెల్లడించారు. జూలై 12న రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో రాంకీ ఈ చిత్రానికి సంబంధించిన, వ్యక్తిగత జీవితానికి చెందిన విషయాలను పంచుకొన్నారు. రాంకీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. RX 100 కథ తీసుకొని నా వద్దకు వచ్చారు. కథ విన్న తర్వాత వెంటనే ఆ పాత్రను చేయాలనుకొన్నాను. కొందరు కథను అలా ఇలా అని చెబుతారు. కానీ షూటింగ్‌కు వచ్చిన తర్వాత చెప్పింది ఒకటి చేసేది ఒకటిగా ఉంటుంది. అలాంటి సమయంలో యాక్టర్లు కాంప్రమైజ్ అయితే వారికి ఉన్న ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కానీ RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఏదైతో చెప్పాడో అది తీశాడు. దర్శకుడు అజయ్ భూపతి పనితీరు చూసి మొదటి రోజే ఇంప్రెస్ అయ్యాను. ఏదైతె చెప్పాడో అలానే తీశాడు. రాంగోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా పనిచేసిన ఆయనకు RX 100 చిత్రం తొలి ప్రయత్నం. కానీ 30 చిత్రాలు అనుభవం ఉన్న దర్శకుడిగా ప్రతిభను చాటుకొన్నారు. కొన్ని సినిమాల్లో క్లైమాక్స్‌లోనే రెండు కెమెరాలు ఉపయోగించరు. కానీ ఈ చిత్రానికి సంబంధించి ప్రతీ సీన్‌లోను ఐదు కెమెరాలు ఉపయోగించారు.