MS Dhoni's Bullet Last-Ball Throw To Dismiss Chris Jordan
  • 6 years ago
వికెట్ల వెనుక మహేంద్రసింగ్ ధోనీ ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. వికెట్ కీపింగ్ ప్రమాణాల్లో ధోనీతో సరితూగగల వికెట్ కీపర్‌ ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలోనే ఎవరూ లేరని వన్డే, టీ20ల్లో అతను సాధిస్తున్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి ధోనీని బోల్తా కొట్టిస్తూ ఆఖరి బంతికి పరుగు తీయాలని ఆశించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోర్దాన్‌కి నిరాశే ఎదురైంది. అతను క్రీజులోకి వచ్చేలోపే.. బెయిల్స్‌ అతనికి స్వాగతం పలికాయి. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక స్టంపౌట్స్ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పిన ధోనీ.. ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టి మొత్తంగా 50 క్యాచ్‌లు అందుకున్న ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ని యువ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ కౌల్ వేశాడు. ఆ ఓవర్‌లోని ఐదు బంతులు ముగిసేసరికి.. ఇంగ్లాండ్ 198/8తో నిలిచింది. దీంతో.. చివరి బంతికి ఎలాగైనా ఒక పరుగు తీసి.. భారత్‌ ముందు 200 పరుగుల టార్గెట్‌ను ఉంచాలని క్రీజులో ఉన్న ఆదిల్ రషీద్, జోర్దాన్ నిర్ణయించుకున్నారు. దీంతో.. షార్ట్‌పిచ్‌ రూపంలో బంతిని విసరాల్సిందిగా.. శార్ధూల్‌కి ధోనీ సూచించాడు. ఈ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్దాన్.. ఒకవేళ బంతి బ్యాట్‌కి తగలకపోయినా.. పరుగు తీయాలని సైగల ద్వారా ఆదిల్ రషీద్‌కి తెలియజేశాడు. దీన్ని పసిగట్టిన ధోనీ.. ముందుగానే తన కుడిచేతి గ్లౌవ్‌ని తీసేసి రనౌట్‌కి సిద్ధమైపోయాడు. వ్యూహం ప్రకారం సిద్ధార్థ కౌల్ షార్ట్‌పిచ్ బంతిని విసరగా.. దాన్ని ఆదిల్ రషీద్ కనీసం టచ్‌ కూడా చేయలేకయాడు. అయినప్పటికీ.. పరుగు కోసం జోర్దాన్ ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ధోనీ మెరుపు వేగంతో బంతిని వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు.

MS Dhoni was at his brilliant best in the series-deciding third T20I between India and England as he created an all-time record by taking 5 catches in a single game. Another brilliant glove work of his which caught the attention of the fans, Dhoni dismissed Chris Jordan on the final ball of the innings with a bullet throw.
Recommended