పవన్, జగన్ సభలకు జనాలు వస్తారు కానీ..ఓట్లు ఎవరు వేస్తారు??

  • 6 years ago
BJP senior leader Krishnam Raju responed on Cine Actor Prabhas's political entry.
#prabhas
#pawankalyan
#krishnamraju
#bjp
#chandrababunaidu
#andhrapradesh

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాపం పండే రోజు దగ్గరలోనే ఉందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. విజయవాడలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారని కృష్ణంరాజు మండిపడ్డారు. ప్రతీ పనిలోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.
బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయామని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, నిజానికి బీజేపీతో పొత్తు వల్లే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని కృష్ణంరాజు చెప్పారు.

Recommended