Interpol Issues Red Corner Notice Against Nirav Modi

  • 6 years ago
The Interpol has issued a red corner notice against PNB Fraud accused Nirav Modi. With the notice being issued, it would restrict the moves of the accused who has been moving from one country to another.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో సుమారు 13వేల కోట్ల రూపాయలకుపైగా కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపై ఎట్టకేలకు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. భారత దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థన మేరకు నీరవ్ మోడీపై ఇంటర్‌పోల్ ఈ నోటీసు జారీ చేసింది. విదేశాలకు వెళ్లి తలదాచుకుంటున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు ఈ రెడ్ కార్నర్ నోటీసు ఉపయోగపడుతుంది. రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్‌పోల్ తన సభ్య దేశాలకు జారీ చేస్తుంది.
ఒక దేశానికి సంబంధించిన నేరస్తుడు ఇతర దేశాల్లో ఉంటే.. అతడ్ని అరెస్ట్ చేయాలని ఇంటర్ పోల్ తన సభ్య దేశాలను కోరుతోంది. నీరవ్ మోడీ కేసులో సీబీఐ ఇప్పటికే ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేసింది.
#niravmodi
#pnbfraudcase
#interpol
#cbi

Recommended