Sehwag Greets Dale Steyn On His Birthday With Epic Tweet

  • 6 years ago
South African speedster Dale Steyn turned 35 on Wednesday and messages and wishes poured in from all quarters. As fans, along with fellow team mates showered greetings on social media, Steyn, one of the most lethal bowlers of the modern era, also received praise from one of India's greatest openers, Virender Sehwag.
#dalesteyn
#southafrica
#bowling
#happybirthday
#virendersehwag

వైవిధ్యంగా ట్వీట్లు చేయడంలో సెహ్వాగ్ దిట్ట. అదే సందర్భమైనా సరే.. ప్రత్యేకమైన రీతిలో ట్వీట్ చేసి అందరిలో ప్రత్యేకతను చాటుకుంటాడు. ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్‌కు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు సెహ్వాగ్. '35 పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్న డేల్ స్టెయిన్‌కు శుభాకాంక్షలు. స్టెయిన్ బౌలింగ్ వేస్తే.. ప్రకృతి ఉన్న దానికంటే ఇంకా పచ్చగా కనిపిస్తుంది.' అంటూ సెటైరికల్ పంచ్ వేసి శుభాకంక్షలు తెలిపాడు.
గతేడాది టీమిండియా ముగించుకున్న దక్షిణాఫ్రికా పర్యటనలో డేల్ స్టెయిన్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు డేల్ స్టెయిన్ అందుబాటులోకి రానున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ సందర్భంగా డేల్ స్టెయిన్ మాట్లాడుతూ "నా టార్గెట్‌ 100 టెస్టులు, 500 వికెట్లు , 2019 ప్రపంచకప్‌" అని పేర్కొన్నాడు.

Recommended