Disha Patani's Sangamithra To Go On Sets Soon

  • 6 years ago
Director Sundar C announced that he'd be directing his dream project Sangamithra. After having a grand launch at Cannes Film Festival in 2017, the film has run into several delays.

తమిళంలో ఇప్పటివరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందనున్న సంఘమిత్ర చిత్రం త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నది. బాలీవుడ్ శృంగార తార దిశా పటానీ యుద్ధనారీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సీ రూపొందించే ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
సంఘమిత్ర చిత్రం కనీవిని ఎరుగని రీతిలో సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నది. యుద్ధ నేపథ్యంగా సాగే ఎమోషనల్ డ్రామాగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రాన్ని థెనండాల్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తున్నది.
సంఘమిత్ర చిత్రం కోసం హైదరాబాద్‌తో ఓ భారీ, విలాసవంతమైన సెట్‌ను ఇప్పటికే రూపొందించారు. ఈ సెట్స్‌లోనే ఈ చిత్రం నిరంతరంగా షూటింగ్ జరుపుకొంటుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంలో జయం రవి, ఆర్య కీలక పాత్రలను పోషిస్తున్నారు.

Recommended