జేసీ ఏం మాటలవి, వాటిని ఎవరూ పట్టించుకోవద్దు : ఆదినారాయణ రెడ్డి

  • 6 years ago
Andhra Pradesh Minister Adinarayana Reddy counter Anantapur MP JC Diwakar Reddy over his comments on Kadapa steel plant.

కడప స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌కు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైయస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. కులాభిమానం ఉండవచ్చు కానీ దురభిమానం ఉండవద్దన్నారు.జగన్ gurinchi జేసీ మాట్లాడుతూ.. రాజకీయంగా ఆయనతో విభేదించినప్పటికీ, అతని పట్ల తనకు కొంత అభిమానం, ప్రేమ ఉందని చెప్పారు. అందుకు రెడ్డి కారణం అన్నారు. అందరికీ కులాభిమానం ఉందని చెప్పారు.
ఇలాంటి దీక్షల వల్ల కడప స్టీల్ ప్లాంట్ రాదని జేసీ దివాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఏం చేయడని చెప్పారు. తాను మూడున్నరేళ్ల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ విషయం చెప్పానని అన్నారు. అలాంటి కేంద్ర ప్రభుత్వం ఉండటం మన ఖర్మ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఓ వర్గాన్ని హత్యలు చేయించిన నరేంద్ర మోడీకి ప్రధానిగా ఉండే అర్హత లేదని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Recommended