The embattled Australian team has slipped to a 34-year low in the ICC ODI rankings, dropping to sixth place following back-to-back defeats against England in the ongoing five-match series. With losses to the world no.1 ODI team in London and Cardiff, Australia have fallen to 102 rankings points to sit a fraction of a point below 2017 Champions Trophy winners.
ఆస్ట్రేలియా క్రికెట్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. టాంపరింగ్ వివాదంతో పలు విమర్శలు ఎదుర్కొన్న ఆసీస్ క్రికెట్.. మళ్లీ పాత ఫామ్‌ను తీసుకురాలేకపోతోంది. మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే పేలవ ప్రదర్శన చూపించడంతో.. మాజీ క్రికెటర్లు సైతం జట్టుకు చివాట్లు పెడుతున్నారు. ఆసీస్ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన కావడంతో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్... 'నిద్ర లేవండి, ఇంగ్లండ్ స్కోరు ఒకసారి చూడండి. అసలు అక్కడ ఏం జరుగుతోంది. వాట్ ద హెల్ అంటూ' ట్వీట్ చేశాడు. ఇక ఆసీస్ మాజీ సారథి మైకేల్ క్లార్క్ కూడా ట్విటర్ వేదికగా తమ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాగా 1986లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగులతో ఓడిన ఆసీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆ రికార్డును అధిగమించి మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన డే- నైట్ వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టిమ్ పైనె జట్టు దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజాలు షేన్ వార్న్, మైకెల్ క్లార్క్‌లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Be the first to comment