Skip to playerSkip to main content
  • 8 years ago
Ronaldo's diving header after four minutes of Portugal's 1-0 World Cup Group B win saw him surpass the great Ferenc Puskas as the most prolific European of all-time in international football.

ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో మరోసారి మెరుపు ప్రదర్శన చేశాడు. గ్రూపు-బిలో మొరాకోతో జరుగుతున్న మ్యాచ్‌లో రొనాల్డో 4వ నిమిషంలోనే హేడర్‌గోల్‌తో‌ పోర్చుగల్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాతి నుంచి ఇరు జట్లు బంతిని నియంత్రణలో ఉంచుకోవడానికి తీవ్రంగా పోటీపడ్డాయి.
మ్యాచ్ ఆరంభమైన నాలుగు నిమిషాలకే గోల్ కొట్టి అదరగొట్టాడు. తనదైన శైలిలో హెడర్ గోల్‌తో పోర్చుగల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. రొనాల్డో వేగాన్ని చూసి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆశ్చర్యపోయారు. తరువాత తేరుకున్న మొరాకో గట్టిగానే పుంజుకుంది. ఆ తర్వాత ఇరు జట్లు బంతిని నియంత్రించేందుకు గట్టిగానే పోటీపడ్డాయి
రెండు జట్లు గోల్‌పోస్ట్‌లపై ఎటాకింగ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రథమార్థంలో రెండు టీమ్‌లు బంతిని తమ ఆధీనంలో ఉంచుకునేందుకు పోరాడాయి. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న పోర్చుగల్ 1-0గోల్‌తో విజయం సాధించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్‌తో ఇరాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన మొరాకోకు మరోసారి నిరాశ తప్పలేదు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended