SS Thaman Background Score For Niharika's Happy Wedding

  • 6 years ago
After the failure of her debut film 'Oka Manasu', Niharika took a huge sabbatical before signing her second Telugu film, "Happy Wedding". Happening production house UV Creations is presenting this youthful entertainer that is being bankrolled by Pocket Cinema.


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో అత్యంత భారీ వ్యయంతో 4 భాషల్లో ప్రతిష్టాత్మకంగా సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా "హ్యాపి వెడ్డింగ్" యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు.
సుమంత్ అశ్విన్, నిహారిక మ‌ధ్య జ‌రిగే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. మ్యూజికల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ కి అద్భుతమైన సంగీతం అందించిన తమన్ రీ రీ రికార్డింగ్ చేస్తుండడం విశేషం. రీ రీ రికార్డింగ్ లో తమన్ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు ఫిదా చిత్రం తో సంగీత ప్రియులకు మంచి మ్యూజికల్ ఫీస్ట్ అందించిన శక్తికాంత్ అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. తమన్ రీ రీ రికార్డింగ్, శక్తికాంత్ పాటలతో హ్యాపీ వెడ్డింగ్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలవనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Recommended