Too Much Water Can Leads to Brain Swelling??

  • 6 years ago
Research has indicated that drinking too much of water can lead to excess fluid accumulation and cause dangerous low sodium levels in the blood or even brain swelling. The normal intake of water should be 8 to 10 glasses a day. Water intoxication causes low blood concentration of sodium, without adequate replacement of sodium.
#water
#sideeffects
#health
#wellness
#Intoxication

మండే వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి మనం ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉంటాం. నీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ ను అరికట్టవచ్చని డాక్టర్ల నుంచి కూడా సూచనలు అందుతాయి. అయితే, డీహైడ్రేషన్ లాగానే ఓవర్ హైడ్రేషన్ కూడా ప్రమాదకరం. ఇటీవలి అధ్యయనం ప్రకారం ఎక్కువగా నీటిని తీసుకుంటే శరీరంలో నీరు నిలిచిపోవడం అధికమవుతుంది. అందువలన, రక్తంలో ప్రమాదకరంగా సోడియం స్థాయిలు తక్కువవుతాయి. మెదడు కూడా వాపుకు గురవవచ్చు. ఈ ఆర్టికల్లో వాటర్ ఇంటాక్సికేషన్ గురించి తెలుసుకుందాం.
వాటర్ ఇంటాక్సికేషన్ అంటే ఏంటి? సోడియం యొక్క తక్కువ రక్త సాంద్రత (హైపోనట్రేమియా)ను వాటర్ ఇంటాక్సికేషన్ గా పేర్కొంటారు. తగినంత సోడియాన్ని భర్తీ చేయకుండా నీటిని ఎక్కువగా తాగడం వలన ఇలా జరుగుతుంది. తగినంత నీటిని తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. మలబద్దకం సమస్య అరికట్టబడుతుంది. టాక్సిన్స్ శరీరంలోంచి బయటకు పోతాయి. అలాగే శరీరంలోని అన్ని మేజర్ ఫంక్షన్స్ సజావుగా సాగుతాయి. ఓవర్ హైడ్రేషన్ ను హైపోనట్రేమియా, హైపర్హైడ్రేషన్ మరియు వాటర్ పాయిజనింగ్ అని కూడా అంటారు. ఎలెక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వలన ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు.