Virat Kohli Wax Statue Gets Damaged

  • 6 years ago
he charismatic batsman became the first active cricketer to be waxed and his statue installed at the iconic museum. The 29-year-old cricketer from Delhi has joined global sporting icons like Sachin Tendulkar, Cristiano Ronaldo, Lionel Messi, Usain Bolt, Kapil Dev and MC Mary Kom.
#charismaticbatsman
#SachinTendulkar
#CristianoRonaldo

బుధవారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం దేశ రాజధాని ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విగ్రహం కాస్త దెబ్బ తిన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బుధవారం(జూన్‌ 6న) ఉదయం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌ సరసన న్యూఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో విరాట్‌ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
కోహ్లీ మైనపు విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు మ్యూజియానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతేకాదు కోహ్లీ విగ్రహంతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ కుడి చెవి పైభాగం పాక్షికంగా దెబ్బతింది. వెంటనే గమనించిన మ్యూజియం నిర్వాహకులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు.

Category

🥇
Sports

Recommended