Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Mahesh Babu movie stands after Bahubali. Bharat Ane Nenu satellite rights sold for a whopping amount

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 100 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రంగా భరత్ అనే నేను నిలిచింది. 200 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. మహేష్ బాబుని కొరటాల శివ ముఖ్యమంత్రిగా ప్రజెంట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మహేష్, కొరటాల కాంబినేషన్ లో అంతకు ముందే శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విజయాన్ని కొనసాగిస్తూ భరత్ అనే నేను కూడా విజయం సాధించింది. ఈ చిత్రం తాజగా మరో ఘనత సొంతం చేసుకుంది.
భారత అనే నేను చిత్రంలో మహేష్ బాబు యువ ముఖ్యమంత్రిగా నటించాడు. ముఖ్యమంత్రిగా మహేష్ నటన ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటించడం కూడా ప్లస్ అయిందనిచెప్పొచ్చు.
భరత్ అనే నేను చిత్రం మరో రికార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్ర శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ సంస్థ భరత్ అనే నేను శాటిలైట్ హక్కులని రూ 22 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended