Yuvraj Launches His Sports Brand YWC Hyderabad

  • 6 years ago
Indian International cricketer Yuvraj Singh launched his sports brand YouWeCan (YWC) at the newly renovated Mana Hyderabad Central, here on Tuesday. Yuvraj Singh campaigner for cancer awareness. The brand has a huge range of sportswear, sports accessories and equipments.
#yuvrajsingh
#india
#hyderabad
#cricket

టీమిండియా క్రికెటర్, సిక్సుల వీరుడు యువరాజ్‌ సింగ్‌ హైదరాబాద్‌లో సందడి చేశారు. తన స్పోర్ట్స్‌ బ్రాండ్‌ 'యూవీకెన్‌'ను పంజాగుట్టలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌లో ఈ రోజు ప్రారంభించారు. నూతనంగా ఆధునీకరించిన మాల్‌లో యూవీకెన్‌ బ్రాండ్‌కు చెందిన స్పోర్ట్స్‌ దుస్తులు, టోపీలు, యాక్సెసరీలు, ఎక్యూప్‌మెంట్‌ తదితరాలతో కూడిన స్టోర్‌ను మంగళవారం సాయంత్రం యువరాజ్‌ సింగ్‌ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి సహకారం కల్పించేందుకు యూవీకెన్‌ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే పేరుతో స్పోర్ట్స్‌ వస్త్రాల బ్రాండ్‌నూ ఏర్పాటుచేసి దాని ద్వారా వచ్చే లాభాలను ఫౌండేషన్‌ ద్వారా జరిగే సేవలకు కేటాయిస్తున్నట్లు వివరించారు. యూవీకెన్‌ బ్రాండ్‌ స్టోర్‌లు అన్ని సెంట్రల్‌ మాల్స్‌లోనూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Recommended