Gangstars Telugu Web Series Trailer Promotion

  • 6 years ago
Amazon Prime is set to unveil its first Telugu web series this May. Titled Gangstars, it will be headlined by actor Jagapathi Babu and directed by Ajay Bhuyan.

జగపతి బాబు, నవదీప్, శ్వేత బసు ప్రసాద్, శివాజీ, పోసాని కీలకపాత్రల్లో నటించిన ‘గ్యాంగ్‌స్టార్స్’ వెబ్ మూవీ ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు చిత్రయూనిట్.
ఇండస్ట్రీని తన కనుసన్నల్లో నడిపే ఓ గ్యాంగ్ స్టర్.. నాకు ఇండస్ట్రీ అవసరం లేదు.. నేను ఇండస్ట్రీకి కావాలి అనుకునే టాప్ హీరో.. ఎలాగైనా ఆ హీరోతో సినిమా తీయాలని కలలు కనే ఓ యువ దర్శకుడు..ఇండస్ట్రీని ఏలుతూ.. సింగిల్ షాట్ మాత్రమే అనే కండిషన్ పెట్టే హీరోయిన్.. ఒకే ఒక్కఛాన్స్ హీరోయిన్‌గా నిరూపించుకుంటా అనే అమ్మాయి.. వీళ్లను డీల్ చేసే ఓ బడా ప్రొడ్యుసర్.
‘గ్యాంగ్ స్టార్స్’ టాలీవుడ్‌లో వెబ్ సిరీస్ మూవీ. ఇందులో మొత్తం 13 ఎపిసోడ్‌లు ఉంటాయి. అజయ్ భుయాన్ తొలి వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించగా.. ‘అలా మొదలైంది’ దర్శకురాలు నందిని రెడ్డి కొన్ని ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్‌ ద్వారా జూన్ 1 నుండి ఈ వెబ్ సిరీస్‌ను ఆన్ లైన్‌లో వీక్షించవచ్చు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ గ్యాంగ్ స్టార్స్ రిలీజ్ కానుంది.

Recommended