IPL 2018: No Super Over & Hat-Trick Wickets

  • 6 years ago
The 11th edition of the Indian Premier League starts on April 4 and will continue till May 27, 2018. The first match is between defending champions Mumbai Indians and Chennai Super Kings at the Wankhede Stadium.
#ipl2018
#superover
#ipl2018final
#chennaisuperkings
#sunrisershyderabad

గత ఆదివారంతో ఐపీఎల్ 11వ సీజన్ ముగిసింది. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలవడంతో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఈ సీజన్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మరికొన్ని కొత్త రికార్డులు సైతం నమోదయ్యాయి. అయితే, ఈ సీజన్‌లో ఆ రెండు రికార్డుల్ని మాత్రం క్రికెట్ అభిమానులు వీక్షించలేకపోయారు. ఆ రెండు రికార్డులు ఏంటంటే సూపర్ ఓవర్, హ్యాట్రిక్ వికెట్లు. ఈ రెండు రికార్డులు ఈ సీజన్‌లో నమోదు కాలేదు.
దీంతో పాటు ఈ సీజన్‌లో నమోదైన అతిపెద్ద విజయాలివే. కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌ 102 పరుగులతో గెలిచి ఈ సీజన్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 210 పరుగులు చేయగా, కోల్‌కతా 108 పరుగులకే ఆలౌటైంది.

Recommended