IPL 2018: Seriously Good Knock By Shane Watson, Says David Warner

  • 6 years ago
The final of this year’s Indian Premier League was all about just one man – Shane Watson. The opening batsman blew away Sunrisers Hyderabad with his extraordinary batting in the title-decider. For most part of the game, the Super Kings remained on top and in the end registered a comfortable 8-wicket win to life the title.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు.
సన్‌రైజర్స్ ఇలాంటి ఫలితాన్ని కోరుకోదని.. ఏదేమైనా ఈ టోర్నీలో సన్‌రైజర్స్ ఆటతీరు అభినందనీయమని డేవిడ్ వార్నర్ ట్వీట్ చేశాడు. షేన్ వాట్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని.. అతని ఆటతీరు అద్భుతమని.. షేన్ వాట్సన్ వీరోచిత బ్యాటింగ్ చూడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ట్వీట్ చేశాడు.
సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వివాదంలో డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ నుంచి వార్నర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ జట్టు 2016లో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో బెంగళూరు జట్టుపై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
#ipl2018
#shanewatson
#davidwarner
#sunrisershyderabad

Recommended