ద్రోహం చేయలేనన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే : షాక్ కు గురైన 'గాలి'

  • 6 years ago
Hours to go for the crucial trust vote in the Karnataka assembly and the Congress has released an explosive audio clip to prove their allegation of horse-trading by the BJP. The party in a press meeting in Bengaluru on Friday evening released a 2 minute 41 second audio clip, and alleged that it had the voice of mining baron and former BJP minister Janardhana Reddy can be heard speaking to Congress Raichur Rural MLA-elect Basavanagouda Daddal.
#KarnatakaAssembly
#Yeddyurappa
#PrakashRaj
#GalijanardhanReddy
#Basavanagowda
#AudioTapeleak


రేపు సాయంత్రం 4.30గం.కి బీజేపీ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సిన నేపథ్యంలో.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ బేరసారాలను మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ సంచలన ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది.బెంగళూరులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2నిమిషాల 41సెకన్ల నిడివి గల ఆడియో టేపును కాంగ్రెస్ బయటపెట్టింది.
ఆడియో టేపులో మైనింగ్ కింగ్, మాజీ బీజేపీ మంత్రి గాలి జనార్దన రెడ్డి రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసవనగౌడకి భారీ ఎత్తున డబ్బు ఆఫర్ చేసినట్టుగా సంభాషణ రికార్డయింది. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకే గాలి జనార్దన్ రెడ్డి ఈ చర్యకు పూనుకున్నారని, సంభాషణల్లో ఆ పార్టీ 'జాతీయ అధ్యక్షుడి' గురించి కూడా ప్రస్తావించారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
ఆడియో సంభాషణను గమనించినట్టయితే.. బసవనగౌడకు తొలుత ఓ వ్యక్తి ఫోన్ చేసి 'జనార్దన్ సార్ తో మాట్లాడటానికి మీరు ఫ్రీగా ఉన్నారా?' అని ఆరా తీశారు. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి లైన్ లోకి వచ్చారు. ఆడియో టేపు సంభాషణ యథావిధిగా: బసవనగౌడ: ఎస్, చెప్పండి.. జనార్దన రెడ్డి: మాట్లాడటానికి ఫ్రీగా ఉన్నారా? బసవనగౌడ: అవును, ఫ్రీగానే ఉన్నా జనార్దనరెడ్డి: ఇంతకుముందు జరిగిందంతా మరిచిపోండి. ప్రతికూల సంగతులన్ని మరిచిపోండి. మీ కిప్పుడు మంచి టైమ్ స్టార్ట్ అయింది. చాలా పెద్ద మనుషులు, జాతీయ అధ్యక్షుడు మీతో కూర్చొని మాట్లాడుతారు.. మీకే పదవి కావాలో, అసలు మీకేం కావాలో ఒక్కొక్కటిగా చెప్పండి. ఆ తర్వాత మా పని మేం చేస్తాం.

Recommended