Allu Arjun Praises Mahanati Movie Team

  • 6 years ago
Here is Allu Arjun Superb Speech At Mahanati Success Celebrations. The greatest story ever told about the greatest actress that ever lived. It is such a privilege to make a biopic of the one and only Mahanati Savitri, an iconic actress we were ever blessed with. #Mahanati is an ode to the great soul that etched a special place in all our hearts.
#Mahanati
#AlluArjun

అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' చిత్రానికి కేవలం 5 రోజుల గ్యాపుతో విడుదలైన 'మహానటి' సూపర్ డూపర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'మహానటి' చిత్రబృందాన్ని పిలిచి అల్లు అరవింద్, అల్లు అర్జున్ పార్టీ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ పార్టీలో పాల్గొన్న బన్నీ చేసిన కామెంట్స్ మరింత చర్చనీయాంశం అయ్యాయి. 'మహానటి' చూసిన తర్వాత బన్నీ రెస్ట్‌లెస్‌గా మారారట. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. చివరకు నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోవాల్సి వచ్చిందట. అయినా కూడా సరిగా నిద్రపట్టలేదని బన్నీ వెల్లడించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...‘సినిమా చూసిన తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్‌కి ఫోన్‌ చేసినప్పుడు కంగ్రాట్స్‌, సూపర్‌హిట్‌, బ్లాక్‌బస్టర్‌ వంటి పిచ్చి పదాలు వాడాలనుకోలేదు. ఇలాంటి సినిమా తీసినందుకు థాంక్స్ చెప్పి అందరం గర్వపడే సినిమా తీశావని చెప్పాలనుకున్నాను' అని బన్నీ తెలిపారు.
సినిమా చూసిన తర్వాత అసలు నాకు నిద్రపట్టలేదు. ఇది నేను వేలాకోలానికి చెప్పడం లేదు. నా జీవితంలో ఫస్ట్ టైమ్ జెట్‌ల్యాగ్‌ ట్యాబ్లెట్‌(నిద్రమాత్ర) వేసుకుని నిద్రపోయాను. అది వేసుకుని రాత్రి 1.30 గంటలకు పడుకున్నాను. అయినా ఉదయం 5.30కు మెలకువ వచ్చేసింది. ‘మహానటి' సినిమా అంత బాగా నచ్చింది కాబట్టే నిద్ర పట్టలేదు... అని అల్లు అర్జున్ తెలిపారు.
వివి వినాయక్ గారు నాకు ఒక మంచి మాట చెప్పారు. ఒక మంచి స్క్రిప్టు ఉంటే దానికి అయస్కాంతం లాగా అన్నీ మంచి విషయాలే వచ్చి అంటుకుంటాయి. మంచి కెమెరామెన్, మంచి యాక్టర్లు, ఇలా అన్నీ సూపర్ గా సెట్టవుతాయన్నారు. ‘మహానటి' సినిమా చూసినపుడు నాకు ఆయన చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి... అని బన్నీ తెలిపారు.
ఈ సినిమా మీరు తప్ప ఎవరు తీసినా ఇలా ఉండదు. క్యాలిక్యులేషన్స్, మ్యాడ్ నెస్, జెన్యూనిటీ అన్ని మీలో ఉన్నాయి కాబట్టే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. చాలా నిజాయతీగా తీశారు. లెక్కపెట్టి తీస్తే లెక్కే వస్తుంది. లెక్కపెట్టకుండా తీస్తే లెక్కలేనంత వస్తుంది. అందుకు చక్కటి ఉదాహరణ ‘బాహుబలి'. ఆ సినిమా లెక్క పెట్టకుండా తీశారు కాబట్టే లెక్కలేనంత డబ్బు వచ్చిందని బన్నీ తెలిపారు.

Recommended