అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో...రణరంగంలా మారిన గుంటూరు

  • 6 years ago
గుంటూరు:మంగళవారం రాత్రి ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు పోలీసులకు లొంగిపోవడంతో అతడిని తమకి అప్పగించాలంటూ బాధిత బాలిక తరుపు బంధువులు పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రెచ్చిపోయిన సమూహం పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలవ్వడంతో పాటు పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి తరిమికొట్టారు. దీంతో అర్భన్ ఎస్పీ విజయారావు స్టేషన్ వద్దకు చేరుకొని పరిస్థితి సద్దుమణిగేందుకు కృషి చేశారు.

Recommended