Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Karnataka Election results are in very interesting. Entire Nation is looking at Karanataka Elections. Election results are in trending stage. BJP, Congress is neck to neck situation. Karanataka leading towards Hung assembly. BJP crosses 100 seats. Celebrations in the form of slogans have begun in the headquarter of the BJP in Bengaluru as the party has crossed the 100 mark. The halfway mark in Karnataka assembly is 113.
#KarnatakaAssemblyElections2018
#Siddaramaiah
#Yeddyurappa
#Kumaraswamy

కర్ణాటకలో స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ దూసుకెళ్తున్నది. తొలుత హంగ్ ఏర్పడుతుందనే భావించిన విశ్లేషకులకు కన్నడ ఫలితాలు షాకిచ్చాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుపై కూడా ఓటర్లు ఆసక్తిచూపలేదనేది ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఓటర్లు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నేందుకు బీజేపీ పార్టీ యంత్రాంగం చకచకా పావులు కదుపుతున్నది. బీజేపీ చీఫ్ అమిత్‌ షాతో సమావేశమైన తర్వాత పార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ బెంగళూరు చేరుకొన్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏం చేయాలనే వ్యూహంపై పార్టీ నేతలతో చర్చల్లో మునిగిపోయారు.
బీజేపీ గెలుపుపై సీనియర్ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ధీమా వ్యక్తం చేశారు. జేడీఎస్‌తో పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. మాకు ఎలాంటి పొత్తు అవసరం లేదు. కర్ణాటకలో బీజేపీ విజయం మాదే అని సదానంద గౌడ్ అన్నారు.
త్వరలో జరుగబోయే ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కూడా విజయం మాదే అని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 21 రాష్ట్రాలను సొంతం చేసుకొన్న బీజేపీ విజయ గర్వంతో దూసుకెళ్తున్నది.
ఫలితాల అనంతరం హంగ్‌కు అవకాశం ఏర్పడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేశారు. సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, ఆజాద్‌ బెంగుళూరులో మకాం వేసి పరిస్థితిని అంచనావేస్తున్నారు. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో కలిసి తాజా ఫలితాలపై విశ్లేషిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రతికూలంగా రావడంతో

Category

🗞
News

Recommended