IPL 2018: Kohli Reveals Reasons To Loose The Match
  • 6 years ago
This match too, you might have thought the same when SRH finished under 150. But once again, they have testified their new sobriquet: 'Masters of defence'. Virat Kohli: [RCB's performance] Not good enough, not up to the mark. We deserve to lose this game.
#RoyalChallengersbangalore
#Kohli
#SunrisersHyderabad
#IPL2018


బెంగళూరు జట్టులో స్టార్ బ్యాట్స్‌మెన్‌లున్నా ఆడిన 10మ్యాచ్‌లలోనూ 7ఓడిపోవడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చెప్పుకోవడానికి కోహ్లి, డివిలియర్స్, మెక్‌కల్లమ్ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లు.. సౌథీ, ఉమేశ్ యాదవ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లతో ఆర్‌సీబీ జట్టు పటిష్టంగా ఉంది. కానీ, వైఫల్యాలే మిగిలాయి వీటిపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ ఓటములపై కారణమిదేనంటూ విశ్లేషించాడు.
ప్రతి మ్యాచ్‌ను గెలవాలనే కసితో బరిలో దిగే కోహ్లి లాంటి కెప్టెన్‌కు ఇలాంటి పరాజయాలు మింగుడుపడని విషయాలు. ముఖ్యంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌పై ఆ జట్టు ఓడిన తీరు ఘోరం. 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో తొలి 7 ఓవర్లలో 60 పరుగులు చేసినా ఆ జట్టు చివరకు విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచింది.
సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం జట్టు ప్రదర్శనపై కోహ్లి పెదవి విరిచాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన తీరు పట్ల విరాట్ అసహనం వ్యక్తం చేశాడు.
మా జట్టు ఏమాత్రం బాగా ఆడలేదు. ఓటమికి పూర్తిగా అర్హులం. మేం ఆడకూడని షాట్లు ఆడాం. మన్‌దీప్, గ్రాండ్‌హోమ్ జట్టును గెలిపించడానికి ప్రయత్నించారు. కానీ బలమైన సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగమే పై చేయి సాధించింది. బౌలింగ్ విభాగంలో హైదరాబాద్‌కు మరో 10-15 పరుగులు తక్కువగా ఇచ్చి ఉండాల్సింది.
‘మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకున్నాం. ఫీల్డింగ్ బాగా చేశాం. ఈ సీజన్‌కు ఇక ఇంతే. సన్‌రైజర్స్ ఆటగాళ్లకు తమ బలమేంటో, పరిమితులేంటో తెలుసు. తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే వారు ఆడతారు. ఒత్తిడిలోనూ తమదైన ఆటతీరు కనబరుస్తారు. మా జట్టుకు సన్‌రైజర్స్‌కు అదే తేడా. టీంలో బలమైన ఆటగాళ్లుంటే టోర్నీలో ముందుకెళ్లొచ్చు. ఆల్‌రౌండ్ టీంగా చెన్నై, పంజాబ్ బాగున్నాయి. సన్‌రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా ఉందని కోహ్లి చెప్పాడు.
Recommended