IPL 2018: SRH VS KXIP Match preview

  • 6 years ago
The Sunrisers seemed low on confidence after two close defeats, but come as it did in a low-scoring match, where they once again proved adept at applying the choke, the Hyderabad outfit has shown that it not only travels well – they have won two out of their three away games so far – but also that the importance of match-ups cannot be overstated.
ఇప్పుడు ఓటమికి బదులు తీర్చుకునేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అవకాశం లభించింది. సొంతగడ్డపై గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ తలపడుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగింట విజయం సాధించగా... రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 3వ స్ధానంలో కొనసాగుతోంది.
సొంతగడ్డపై చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ, వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ఆ జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో 118 పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకుని, ముంబై ఇండియన్స్‌ను 87 పరుగులకే కుప్పకూల్చిన తీరు నిజంగా అద్భుతం.
సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ భువనేశ్వర్‌ లేకున్నప్పటికీ, జట్టులోని యువ ఆటగాళ్లు సందీప్‌శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, బాసిల్‌ థంపి.. స్పిన్నర్లు మహ్మద్‌ నబి, షకిబ్‌ అల్‌ హసన్‌, రషీద్‌ఖాన్‌ కలిసికట్టుగా జట్టుకు విజయాన్ని అందించిన తీరు ప్రశంసనీయం. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకొచ్చిన ధావన్‌ పూర్తిగా విఫలమయ్యాడు.
ఇక, కెప్టెన్‌ విలియమ్సన్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోవడం.. మిడిలార్డర్‌లో సాహా, మనీష్‌ పాండే, షకిబ్‌ ఉల్ హాసన్ తక్కువ స్కోర్లకే పరిమితం కావడం... హైదరాబాద్ బ్యాటింగ్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇక, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయాల్లో క్రిస్ గేల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
#SRH
#KXIP

Category

🥇
Sports

Recommended