Sahoo:Evelyn Sharma Says That She Missed An Opportunity With Mahesh

  • 6 years ago
Saaho is a fantastic launch for me says Evelyn Sharma. Evelyn Sharma missed opportunity in Mahesh movie
#Prabhas
#Saaho
#Shraddha Kapoor
జర్మన్ బ్యూటీ ఎవిలిన్ శర్మ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తనకు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సాహోలో నటించే అవకాశం వచ్చిందని ఎవిలిన్ శర్మ ఇటీవల ప్రకటించింది. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందితున్న సాహోలో ఎవిలిన్ కీలక పాత్ర పోషిస్తోందట. సాహో చిత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. ఎవిలిన్ సాహోలో తన పాత్ర గురించి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడూ వివరించింది. యాక్షన్ సన్నివేశాల్లో తాను కనిపిస్తానని చెబుతోంది.ఈ పాత్ర తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని ఎవిలిన్ తెలిపింది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ ముద్దు గుమ్మ శ్రద్దా దాస్ ఈ చిత్రంలో హీరోయిన్. శ్రద్దా దాస్ చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే.
ఎవిలిన్ మాట్లాడుతూ తనకు గతంలో మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని తెలిపింది. కానీ ఆ సమయంలో ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడంతో చేయడం వీలుపడలేదని తెలిపింది. కానీ సాహో చిత్రంతో తెలుగులో తనకు మంచి గుర్తింపు వస్తుందని ఎవిలిన్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Recommended