పవన్ నిషేధం..4 నుంచి 3 ఛానెల్స్ కు..ఏంటి మతలబు?

  • 6 years ago
Pawan Kalyan first announced a war on 4 news channels ... now he is saying war on three. But it's creating doubts that why he excuse the fourth channel.
తన తల్లిని దూషించిన ప్రోగ్రామ్ ను ప్రసారం చేసినందుకు ఎబిఎన్, టివి 9,టివి 5లతో పాటు ప్రత్యేకించి మహా టివి గురించి ప్రస్తావించి మరీ వార్నింగ్ ఇచ్చిన పవన్ ఆ తరువాత ఎందుకనో ఆ ఛానల్ గురించి మాట్లాడటం లేదు. పవన్ తొలి రోజు ఛానళ్లపై తన ట్వీట్ల యుద్దం ప్రకటించిన రోజు మహా టివి గురించి ఏమని ట్వీటాడంటే...మహా టివి ఛానెల్ పెట్టుబడిదారుడు సుజనా చౌదరి లేదా అతని బినామి, ఛానెల్ సిఈవో మరియు మూర్తితో సహా వీరందరూ తన తల్లిని దూషించే కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు తగిన పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని స్పష్టం గా హెచ్చరించాడు.
అయితే ఆ తరువాత 3 రోజులు గడిచాక ఆశ్చర్యంగా పవన్ 3 న్యూస్ ఛానెల్స్ ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మానసిక అశాంతికి గురి చేసే వార్తలు అవసరమే లేదని, పురాతన కాలానికి వెళ్లిపోదామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఛానెల్‌ మాఫియాలాగా తయారైందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.తన తల్లి పైన బూతు కామెంట్ చేస్తే వాటిని ఖండించకుండా పదే పదే చూపించిన మీడియాకు శిక్షపడాల్సిందేనని జనసేన అధినేత తేల్చి చెప్పారు. ఒక వ్యక్తిని పెట్టి నాలుగు నెలల పాటు చర్చలు ఎందుకు పెట్టారని మహేష్ కత్తిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. టీవీ నైన్, ఎబీఎన్, టీవీ 5 ఛానెల్స్ ను బహిష్కరిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. ఇదే విషయమై న్యాయవాదులతో సమావేశమైన ఆయన మీడియాపైన ఎలాంటి చర్యలకు అవకాశముందో తెలుసుకున్నారు.
మొదటిరోజు మహా టివికి వార్నింగ్ పాస్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత సైలెంట్ గా మహా టివిని తప్పిస్తే జనాలు ఏమనుకుంటారో ఆలోచించలేదా?... ఎదుటివాళ్లని తప్పు పట్టేప్పుడు మనల్ని ఎదుటి వాళ్లు కూడా తప్పు పట్టకుండా చూసుకోవాలి కదా?...మహా టివిని తప్పించడానికి తెర వెనుక ఏదో జరిగిందనుకుంటే అది పవన్ ఇమేజీకి డ్యామేజీనే కదా!...మరి అయినా పవన్ సైలెంట్ గా ఆ ఛానెల్ ను సైడ్ చెయ్యడంలో ఆంతర్యం ఏమిటి?...ప్రత్యర్థుల తప్పుల గురించి ప్రతి చిన్న విషయంతో సహా అన్నింటినీ భూతద్దంలో చూస్తున్న పవన్ తాను కూడా పారదర్శకంగా వ్యవహరించాలి కదా...

Recommended