Pawan Kalyan Plans To Start A New TV Channel ?

  • 6 years ago
Actor-politician Pawan Kalyan on Friday morning lashed out at Andhra Chief Minister Chandrababu Naidu for “using the media channels under his control” and diverting attention from the Special Category Status (SCS) to the Sri Reddy issue. Sri Reddy counter to Pawan Kalyan in this issue.

పవన్ కళ్యాణ్ ఛానెల్ పెడుతున్నారనే వార్త ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్...కారణం సింపుల్...మీడియాపైనే యుద్దం ప్రకటించిన పవన్ మరి తానే మీడియా ఓనర్ గా మారుతున్నారంటే వెరీ ఇంట్రెస్టింగే కదా!... ఇంతకీ ఇది నిజమేనా?...అంటే ఇప్పటికిప్పుడు ఎవ్వరూ నిర్థారించలేకపోయినా...ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితులను బట్టి ఈ వార్త నిజమేనేమోనని అందరూ భావిస్తున్నారు. అసలు ఈ ప్రచారం ఎలా మొదలైందంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జె టివి అనే లోగో...క్యాప్షన్...ఇంత పక్కాగా డిజైన్ చేశారంటే ఖచ్చితంగా పవన్ ఛానెల్ పెడుతూ ఉండవచ్చనేది అత్యధికుల భావన.
ఈ ప్రశ్నకు సమాధానం కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. అయితే కొంతకాలం క్రితమే పవన్ కళ్యాణ్ టివి ఛానల్ పెట్టబోతున్నట్లు వార్తలు రావడంతో నిప్పులేందే పొగ రాదు అన్నట్లుగా పవన్ కి టివి ఛానెల్ పెట్టే ఆలోచన ఉండే ఉండొచ్చని చాలా మంది భావించారు. పైగా సినీ హీరో గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఆయనకు టివి ఛానెల్ ఉంటే తనకంటూ అడ్వాంటేజ్ వుంటుంది కాబట్టి ఆ ఆలోచన చేసి ఉండొచ్చని అనుకున్నారు. పైగా మీడియా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా కూడా చేసి ఉండటంతో ఆయనకు మీడియా ప్రాధాన్యత అర్థమై ఛానెల్ పెట్టాలని అనుకోని ఉండొచ్చని మీడియా వర్గాలే విశ్లేషించాయి.
అయితే గతంలో పవన్ ఛానెల్ పెట్టే విషయమై వార్తలు వచ్చినా అప్పుడు కేవలం సినీ, రాజకీయ అవసరాల కారణంగా కాబట్టి తానే ఛానెల్ పెట్టే విషయమై తర్జనభర్జన పడుతూ ఉండొచ్చని...అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కొన్ని టివి ఛానెళ్ల కారణంగా తాను వ్యక్తిగతంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్వయంగా పవనే వెల్లడించడం గమనార్హం. అంతేకాకుండా శుక్రవారం పవన్ కు సంబంధించి జరిగిన పరిణామాలు రాజకీయాల కంటే ప్రధానంగా టీవీ ఛానెళ్లతోనే ముడిపడి ఉండటం...ఆ నేపథ్యంలోనే ఈ టివి ఛానెల్ పెట్టే విషయం ప్రచారంలోకి రానుండటంతో పవన్ ఇక ఖచ్చితంగా ఛానెల్ పెట్టితీరుతారనే అభిప్రాయానికి బలం చేకూరుతోంది.

Recommended