Rangasthalam 18 Days Worldwide Collection Report

  • 6 years ago
Rangasthalam 18 days worldwide collection report. Rangasthalam is the tollywod top movie after Bahubli

బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం జైత్ర యాత్ర కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
రంగస్థలం చిత్రానికి ముందు వరకు రాంచరణ్ మాస్ అంశాలున్న కథలు చేశాడు. రంగస్థలం చిత్రంలో పల్లెటూరి యువకుడిగా వినికిడి లోపంతో పెద్ద సాహసమే చేశాడు. రాంచరణ్ లాంటి స్టార్ హీరో ఇలాంటి పాత్ర చేయడం సాహసమే. కానీ ఆ సాహసాన్ని చరణ్ చిట్టిబాబు పాత్రలో మెప్పించి దిగ్విజయంగా పూర్తి చేసాడు. సుకుమార్ అద్భుత కథతో మ్యాజిక్ చేసాడు.
రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. బాహుబలి1, 2 తరువాత ఆ స్థానంలో నిలిచింది. అభిమానులకు రంగస్థలం చిత్రం కనెక్ట్ కావడంతో బ్రహ్మరథం పట్టారు.
గత నెల 30 న విడుదలైన రంగస్థలం చిత్రం తిరుగులేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో 106 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రాన్ని అధికమించిన రంగస్థలం చిత్రం బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది.
ఈ శుక్రవారం ఏప్రిల్ 20 న సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం విడుదల కాబోతోంది. అక్కడితో రంగస్థలం వసూళ్ల ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్లే. కానీ మహేష్ సినిమా వచ్చేలోపే రంగస్థలం చిత్రం చేయాల్సిన పని మొత్తం పూర్తి చేసి రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రల్లో రంగస్థలం చిత్రం 78 కోట్ల షేర్ రాబట్టింది. కేవలం నైజాంలోనే 23 కోట్ల షేర్ రాబట్టింది.

Recommended