Telugu film artists Allegations on Vakada Appa Rao About Film Industry issue.
శ్రీరెడ్డి చూపిన ధైర్యంతో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ గళం విప్పుతున్నారు. తాము ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి, ఇండస్ట్రీలో కామాంధుల గురించి ధైర్యంగా బయటకు చెబుతున్నారు. తాజాగా టీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి తదితరులు నిర్మాత వాకాడ అప్పారావు గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత వాకాడ అప్పారావు పచ్చి కామాంధుడని, పడుకుంటనే అవకాశాలు ఇస్తానని డైరెక్టుగా మాట్లాడతాడని పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు టీవీ చర్చా కార్యక్రమంలో ఆరోపణలు చేశారు. ఖైదీ నెం 150 సినిమా సమయంలో అవకాశం కోసం ఆఫీసుకు ఫోటో తీసుకుని వెళ్లాము. ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ రాసి అక్కడ ఇచ్చాము. అయితే అక్కడ ఆఫీసులో ఒక వ్యక్తి అందరూ ఫోటోస్ ఇస్తున్నారు, మాకు చూసే టైమ్ కూడా ఉండటం లేదు అని చెప్పి.... ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుతో మాట్లాడాలని చెప్పి అతడి నెంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేసి చిరంజీవి సినిమాలో అవకాశం ఇప్పించండి సార్ అని అడిగితే.... నీ వయసు ఎక్కువగా ఉంది, ఎవరైనా వయసులో ఉన్న అమ్మాయిని సెట్ చేస్తే మీ వయసుకు తగ్గ క్యారెక్టర్ ఇప్పిస్తాను అన్నాడు... అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీవాణి ఆరోపించారు. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, మేమే నటించడానికి వచ్చాము, చిరంజీవి గారి సినిమాలో ఒక్క క్యారెక్టర్ అయినా చేయాలని ఆశతో వచ్చాము.. మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పాం. అపుడు దానికి అతడు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇదంతా కామన్.... ఇది లేనిదే క్యారెక్టర్ ఉండదు. మీరు కొత్తవారు కాబట్టి మీకు తెలియక పోవచ్చు. ఇంతకు ముందు ఉన్న సీనియర్ ఆర్టిస్టులను ఎవరినైనా అడగండి అన్నారు. పడుకుంటే వచ్చే ఆఫర్ తనకు వద్దని వెళ్లి వచ్చానని ఆమె టీవీ చర్చా కార్యక్రమంలో వెల్లడించారు.