Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Nithin gets rare experience at Simhachalam temple. Nithin went Vizag yesterday for Chal Mohan ranga movie promotions.

ఛల్ మోహన్ రంగ చిత్రం ఏప్రిల్ 5 న విడుదలకు సిద్ధం అవుతోంది.దీనితో చిత్ర యూనిట్ అంతా ప్రచారం కోసం వైజాగ్ వెళ్లారు.
వైజాగ్ లో ప్రమోషన్ కార్యక్రమాలని ముగించుకున్నా తర్వాత నితిన్ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సుల కోసం సింహాచలం ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకునే సందర్భంలో నితిన్ కు వింత అనుభవం ఎదురైంది.
ఆలయంలో లక్ష్మి నరసింహ స్వామి వారి ఉంగరం పోయిందని, నితిన్ దొంగిలించాడంటూ ఆలయ అర్చకులు అతడిపై నింద వేశారు. దీనితో నితిన్ ఖంగారు పడిపోయాడు. తాను తీయలేదని కావాలంటే చెక్ చేసుకోండి అంటూ నితిన్ కోరాడు.
తాను ఉంగరం తీయలేదని నితిన్ చెబుతున్నా అర్చకులు బంధించారు. హీరోగా మంచి పేరు సంపాదించిన మీరు స్వామివారి ఉంగరం దొంగిలించడం ఏంటి.. మర్యాదగా ఆ ఉంగరాన్ని ఇచ్చేయండి అంటూ అంటూ అర్చకులు నితిన్ ని నిలదీశారు. నేను తీయలేదు అంటున్నావినిపించుకోలేదు.అనుమానం ఉన్న మరి కొంత మందిని కూడా అర్చకులు బంధించి ఎక్కడకి కదలడానికి వీల్లేదని ఆదేశించారు
ఆలయ అర్చకులు ఎట్టకేలకు ఉంగరం దొరికిందని ప్రకటించడంతో బందీలుగా ఉన్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అర్చకులు అసలు విషయం చెప్పడంతో నితిన్ సహా బందీలుగా ఉన్నా వారు ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. అసలు అక్కడ దొంగతనమే జరగలేదు. ప్రతి ఏడాది స్వామివారికి సింహాద్రి అప్పన్న కల్యాణ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు వినోద ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగానే స్వామివారి ఉంగరం పోయిందంటూ కొంత మంది భక్తులని ఆటపట్టిస్తారు. ప్రతి ఏడాది జరిగే ఈ తంతులో ఈ సారి నితిన్ కూడా భాగమయ్యాడు.

Recommended