నేను శారీరకమైన పాపాలు చేశా, సినిమాలకు దూరం: పాస్టర్‌గా మారిన హీరో రాజా

  • 6 years ago
Tollywood Actor Raja turns as pastor. "I Will Not Act In Movies Anymore" Raja says. In The Past Life And Turning Into A Pastor.

'ఆనంద్' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు చిత్రాల్లో నటించిన నటుడు రాజా చాలా కాలం క్రితమే సినిమాలకు దూరం అయ్యారు. క్రైస్తవం స్వీకరించిన రాజా ప్రస్తుతం పాస్టర్‌గా కొనసాగుతున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
సినిమా రంగంలో నేను చేయని పాపం లేదు. శారీరకంగా, మానసికంగా, ఆలోచన పరంగా చాలా పాపాలు చేశాను. బైబిల్‌లో దేవుడు ఒక విషయం చెప్పాడు. మనిషి హృదయంలో ప్రతి ఆలోచన చెడ్డదే. ఆ పరిస్థితుల్లో నేను బ్రతికాను.
బయటకు చూడటానికి సూటు బూటు వేసుకునే రాజా నిజమైన రాజా కాదు. మీ బాహ్య రూపం నిజమైన రూపం కాదు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. మన అంతరంగాన్ని చూస్తున్నాడు. మనుషులు బాహ్యరూపాన్ని మాత్రమే చూస్తారు. తెరమీద కానీ, నా ఆలోచనలుకానీ, నేను రహస్యంగా చేసిన చెడ్డ పనులు అన్నీ తెలిస్తే నా ఇంటిలోవారుకానీ, నా భార్య బిడ్డలు కానీ ఎవరూ నా పక్కన ఉండరు. అయినా అలాంటి ఒక వ్యక్తిని క్షమించడానికి ఒక దేవుడు చనిపోయాడంటే, ఆ దేవుడిని నేను ఎందుకు కాదనాలి. నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు.
నేను ఇలా మారడానికి కారణం... 2010లో నా జర్నీ క్రీస్తుతో మొదలైంది. డబ్బును చూశాను, ప్రపంచంలో ఉన్న అనుభవాలన్నింటినీ అనుభవించాను. కానీ సుఖం లేదు. సమాధానం లేదు. సంతోషం లేదు. ఏదో ఒక వెలితి. నేను నటుడిగా కొనసాగి ఉంటే ఈ మార్పు నాలో వచ్చేది కాదు. ఈ రోజు నా భార్య దగ్గర దాచుకున్న రహస్యము ఏదీ లేదు. నేను నా భార్యకు ఒకటే చెప్పాను. ఇది నేను ఒకప్పుడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు అంగీకరిస్తావా? అంటే నీ గతంతో నాకు పని లేదు. నువ్వు కొత్త వ్యక్తిగా కనిపిస్తున్నావు అని చెప్పింది.
ఇక నేను ఎప్పటికీ సినిమాల్లో కనిపించను. గెస్ట్ రోల్స్ కూడా చేసే ఆలోచన లేదు. ఇక జీవితం అంతా ఒకటే రోల్. పాస్టర్‌గా జీవితం మొత్తం నన్ను ఇలాగే చూస్తారు అని రాజా తెలిపారు.

Recommended