సోనియాతో బాబు రహస్య చర్చ : వీడియో బయటపెట్టిన సోము వీర్రాజు

  • 6 years ago
BJP MLC Somu Veerraju on Friday demanded that Chief Minister N. Chandrababu Naidu release a White Paper on the steps taken for the development of Rayalaseema and north coastal Andhra regions with Central funds sanctioned.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు.
ఆయన కర్నూలులో పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. వచ్చే 2019 ఎన్నికల్లో తాము (బీజేపీ) ఎక్కువ అసెంబ్లీ, లోకసభ స్థానాలు అడుగుతామని భావించి చంద్రబాబు ఎన్డీయే నుంచి తప్పుకున్నారని చెప్పారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందన్నారు.
ఏపీలో అవినీతిని చూసి పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు రావడం లేదని సోము వీర్రాజు అన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయన్నారు.
హోదా అంటూ చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, రాజకీయ స్వార్థం కోసం టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అభివృద్ధిని రాజధాని అమరావతికే పరిమితం చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేయలేదని, కర్నూలు జిల్లాలో వ్యాగన్‌ వర్క్ షాపునకు అధిక నిధులు కేటాయించిందని వీర్రాజు తెలిపారు. కర్నూలు ఆసుపత్రిని నిమ్స్‌ తరహాలో అభివృద్ధికి ప్రణాళికలు పంపితే నిధులు ఇప్పిస్తామన్నారు. రాయలసీమకు వచ్చిన పరిశ్రమలు, అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
ఏపీ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులపై గతంలో అసెంబ్లీలో చంద్రబాబు ప్రధాని మోడీని అభిమానించారని చెప్పారు. ఇటీవల అసెంబ్లీలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రదర్శించారు. దానికి కౌంటర్‌గా నిధులు ఇస్తున్నందుకు మోడీని అసెంబ్లీలో పొగిడిన వీడియోను సోము వీర్రాజు ప్రదర్శించారు.

Recommended