Poonam Kaur Gets Casted In A Crazy Project "3 Dev"

  • 6 years ago
Poonam Kour once again made indirect comments. My prayers have been answered said Poonam

పూనమ్ కౌర్ చిన్న చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమై గుర్తింపు తెచ్చుకుంది. మాయాజాలం చిత్రంతో పూనమ్ కౌర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఒక విచిత్రం, వినాయకుడు, శౌర్యం, గగనం వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు పొందింది.
ప్రతిభ ఉన్న నటి అయినా పూనమ్ కౌర్ కు అదృష్టం కలిసిరాక కెరీర్ లో పెద్దగా అవకాశాలని అందిపుచ్చుకోలేదు.పూనమ్ కౌర్ ఇటీవల పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.పూనమ్ కౌర్ కెరీర్ ని మలుపుతిప్పే అవకాశం ఆమెకు ఇంతవరకు దక్కలేదు.అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నా అవి చిన్న చిత్రాలలో మాత్రమే. తాజాగా మరో మారు పూనమ్ కౌర్ ఓ ఇంటర్వ్యూ లో పరోక్ష వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల తరచుగా పూనమ్ కౌర్ పరోక్షంగా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ మధ్యన హల్ చల్ చేసిన సినీ క్రిటిక్ వివాదంలో కూడా పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది.
చాలా కాలానికి పూనమ్ కౌర్ నిరీక్షణ ఫలించిందని చెప్పొచ్చు. బాలీవుడ్ లో క్రేజీ చిత్రంలో నటించే అవకాశాన్ని పూనమ్ కౌర్ అందిపుచ్చుకుంది.
పూనమ్ కౌర్ అవకాశం దక్కించుకున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ 3 దేవ్. ఈ చిత్రంలో కరణ్ సింగ్ గోవర్, రవి దుబెయ్, కునాల్ రాయ్ బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులుగా కనిపించబోతున్నారు. కరణ్ సింగ్ గోవర్ సరసన నటించే అవకాశాన్ని పూనమ్ కౌర్ దక్కించుకుంది

Recommended