వచ్చే నెల ఆరంభంలో విజయవాడకు పవన్ కళ్యాణ్

  • 6 years ago
Jana Sena chief Pawan Kalyan to visit Vijayawada next month over Special Status issue.

ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీలో పలు పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోరుతున్నారు. హోదా ఉద్యమంలో భాగంగా ఆయన వచ్చే నెల 4, 5వ తేదీల్లో విజయవాడకు వెళ్లనున్నారు.
అక్కడ పార్టీకి చెందిన కీలక నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసే అంశంపై కూడా ఆయన నేతలకు దిశానిర్దేశనం చేయనున్నారు. తమ పార్టీ కార్యవర్గం పలు విభాగాలుగా అధ్యక్షుల నియామకం వంటి వాటిపై కీలక చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.
జనసేన అధినేత ఇటీవలే విజయవాడలో వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, తదుపరి కార్యాచరణపై ఆయన వారితో చర్చించారు. ఇప్పుడు ప్రత్యేక హోదాతో పాటు పార్టీ అంశంపై దృష్టి సారించనున్నారు.
అయితే ..కేసీఆర్ ప్రతిపాదనకు,ఆయన ప్రయత్నాలకు మద్దతు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు 'థర్డ్ ఫ్రంట్'పై సొంత ఆలోచన మొదలుపెట్టారట.
దేశంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాయని, ప్రజలంతా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురుచూస్తున్నారని పవన్ వామపక్షాల నేతలతో చెప్పారు. మూడో కూటమి ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ..ఆ దిశగా అడుగులు పడితే.. భావ సారూప్యమున్న పార్టీలను ఏకం చేసే బాధ్యతలను కూడా మీకే ఇస్తానని సీపీఎం, సీపీఐ నేతలతో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Recommended