Manchu Lakshmi Talks About Media

  • 6 years ago
Manchu Lakshmi Fires On Media Abusing Actresses . Movie Artist Association (MAA) Chalana Chitra Nirasana Press Meet held at Hyderabad.

సినీ తారల గురించి, వారి క్యారెక్టర్ గురించి మీడియాలో నీచంగా రాయడంపై 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' సీరియస్ అయింది. ఇటీవల ఓ టీవీ చానల్‌ చర్చా కార్యక్రమంలో ఓ న్యూస్ ప్రజెంటర్ సినిమా ఇండస్ట్రీలోని తారలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 'మా' సభ్యులు.... మంగళవారం సమావేశం అయి తమ పట్ల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ తమను మీడియా లోకువ చేసి నీచంగా ఫోకస్ చేయడాన్ని ఖండించారు.
ఓ నెల రోజుల క్రితం నా గురించి వెబ్ సైట్లో తప్పుగా రాశారు. ఇది నాన్న(మోహన్ బాబు) చూసి వెంటనే తగిన విధంగా స్పందించు అన్నారు. నేను ఆయనతో రాయనివ్వండి, ఐ డోంట్ కేర్ అన్నాను. ఆయనకు నాకు గంట పాటు వాదన జరిగింది. తప్పును తప్పుగా నిలదీయాలి, ఇలా ఊరుకుంటారేంటి? అని నాన్న ప్రశ్నించారు. నాన్న ఇది తీస్తే ఇంకొకటి రాస్తారు, ఈ రోజు ఒక సెక్యూరిటీ లేకుండా అయిపోయింది... అని మంచు లక్ష్మి అన్నారు.
న్యూస్ చానల్స్, వెబ్ సైట్లు సెన్సేషనలిజంగా రాసి... తీరా అక్కడికి వెళ్లి క్లిక్ చేస్తే అక్కడ ఏమీ ఉండదు. మేము లిప్‌స్టిక్ వేసుకోవడమో, మేము బట్టలేసుకోవడమో? ఎక్కడో నడుచుకుంటూ వెళ్లడమో తప్ప ఏమీ ఉండదు. మా మొహాలు పెట్టుకుని మీరు డబ్బు సంపాదించుకుంటున్నారని మాకు తెలుసు.
దాసరి నారాయణరావు అంకుల్ ఉండి ఉంటే ఈ రోజు మేము ఇలా మీటింగ్ పెట్టేవారం కాదు. ఏం న్యాయం జరుగాలో ఆల్రెడీ జరిగిపోయి ఉండేది. ప్రెస్‌క్లబ్ వారిని నేను అడుగుతున్నాను... మీలో ఒక జర్నలిస్ట్ బాధ్యతారాహిత్యంగా మా గురించి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకున్నారు? మిమ్మల్ని ఒక్క మాట అంటే మొత్తం ఐక్యం అయిపోతారు, తప్పో ఒప్పో ఆలోచించరు.... మా గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్లారు. మీరు అలా మాట్లాడుతుంటే మేము ఎందుకు ఊరుకోవాలి? మేము ఊరుకునేకొద్దీ మీరు రెచ్చిపోతూ ఉంటారా?... అంటూ మంచు లక్ష్మి మండి పడ్డారు

Recommended