Ball Tampering : Shikhar Dhawan To Lead SRH In IPL 2018
  • 6 years ago
Steve Smith and Warner stood down as captain and vice-captain for rest of Australia's third Test match against South Africa for involvement in ball tampering. Warner may set to stood down as captain for SRH in IPL 2018

క్రికెట్ ఆస్ట్రేలియా నివేదిక వచ్చిన తర్వాతే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై చర్యలు తీసుకుంటామని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.
బాల్ టాంపరింగ్‌ కారణంగా వైస్ కెప్టెన్సీ పదవి నుంచి వైదొలగిన డేవిడ్ వార్నర్‌పై ఐసీసీ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే, సన్‌‌రైజర్స్ యాజమాన్యం మాత్రం అతన్ని కెప్టెన్ హోదా నుంచి తప్పించే యోచనలో ఉంది. అతడి స్థానంలో కెప్టెన్ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో జట్టు యాజమాన్యం చర్చలు జరుపుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ రేసులో ప్రథమంగా శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు. 'కేప్‌టౌన్ టెస్ట్‌లో జరిగింది చాలా దురదృష్టకరమైన ఘటన, ఇప్పుడు ఈ విషయంపై సన్‌రైజర్స్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.అని అన్నాడు.
ఇక వార్నర్‌ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే.. అతని స్థానంలో ఎవరికి కెప్టెన్సీ ఇస్తారనే ప్రశ్నకు గాను 'ఘటన జరిగి రెండు రోజులు మాత్రమే అయింది. దానిపై విచారణ కూడా జరుగుతుంది. వార్నర్ చాలా గొప్ప ఆటగాడు అతని విషయంలో తొందరపాటులో నిర్ణయాన్ని తీసుకోలేం' అని లక్ష్మణ్ చెప్పాడు.
Recommended