Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Mega Hero Ram Charan revealed Shocking revelation on the his next movie. Ram Charan said that he is yet to receive the script and by keeping trust on SS Rajamouli, he signed even without asking for the script. He also revealed that he liked the combination and immediately gave a nod to it.

మెగా పవర్‌స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ ప్రారంభానికి ముందే అనేక సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ చిత్రంపై జరిగినంత చర్చ ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో జరుగలేదు. ఈ చిత్రం గురించి ఎలాంటి విషయాలు అధికారికంగా వెల్లడించకపోయినా.. అనేక రకాలైన వార్తలు మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగస్థలం సినిమా ప్రమోషన్ సందర్భంగా రాంచరణ్ ఓ ఆసక్తికరమైన వార్తను వెల్లడించినట్టు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. అదేమిటంటే..
ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న చిత్రానికి సంబంధించిన సినిమా కథ ఏమిటో ఇప్పటి వరకు నాకు తెలియదు. స్క్రిప్టు ఇంకా నా వద్దకు రాలేదు. రాజమౌళిపై ఉన్న ఒకే ఒక నమ్మకంతో నేను సినిమాను అంగీకరించాను. స్క్రిప్టు ఏది అనిగానీ, కథ ఏంటనీ కూడా అడుగలేదు అని రాంచరణ్ అన్నారు.
ఎన్టీఆర్‌తో కాంబినేషన్ అని అనగానే ఒప్పుకొన్నాను. మల్టీస్టారర్ చిత్రమంటే నాకు చాలా ఇష్టం. తారక్‌తో నటించడమంటే ఇంకా ఇష్టం. త్వరలోనే సినిమా కథను చెబుతానని రాజమౌళి ప్రామిస్ చేశారు అని చెర్రీ పేర్కొన్నారు.
రాజమౌళిని గుడ్డిగా నమ్మాను. కథ, క్యారెక్టర్ ఎంత బలంగా రూపొందిస్తారో నాకు తెలుసు. అందుకే ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తకుండానే సినిమాను ఒకే చేశాను. అంతకుమించి ఆ సినిమా గురించి నాకు ఏమి తెలియదు అని రాంచరణ్ అన్నారు.
బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందించే సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మేమంత ఇతర సినిమా వ్యవహారాలతో బిజీగా ఉన్నాం. మా ప్రాజెక్టులన్నీ ఆగస్టులోగా పూర్తవుతాయి. ఆ తర్వాత సినిమా యూనిట్‌తో కలుస్తాం. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది అని రాంచరణ్ తెలిపారు.

Recommended