Toilet Water In Cool 'Sharbat' ? Beware

  • 6 years ago
A video that went viral on Monday shows a sharbat seller filling water from a toilet in Panchkuva in Kalupur. He is seen holding the pipe over the container on his cart.

ఇలాంటి విషయాలు తెలిస్తే.. బయట ఏదైనా తినాలన్నా.. తాగాలన్నా ఢోకు వచ్చినంత పనవడం ఖాయం. ఆకలి దంచేస్తుందనో.. బాగా దాహం వేస్తుందనో.. ఎక్కడ పడితే అక్కడ తినడం, తాగడం చేస్తే.. ఆ తర్వాత ఇలాంటి నిజాలు తెలుసుకుని బాధపడాల్సిందే. ఇంతకీ విషయమేంటంటే.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కాలూపూర్ పంచకువ ప్రాంతంలో ఓ వ్యక్తి నిమ్మకాయ సోడా అమ్ముతుంటాడు. ఇటీవల ఓరోజు అతని వద్ద ఉన్న నీళ్లు అయిపోవడంతో.. దగ్గరలోని 'పబ్లిక్ టాయిలెట్స్' వద్దకు వెళ్లాడు.
'పబ్లిక్ టాయిలెట్స్' లోపలి నుంచి ఓ పైప్ తీసుకొచ్చి ఖాళీ అయిన స్టీల్ డ్రమ్మును నింపుకున్నాడు. ఆ సమయంలో ఎవరు ఫోటో తీశారో గానీ దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఎండాకాలం దాహం తీర్చుకోవడానికి చాలామంది నిమ్మకాయ సోడా తాగడం కామన్. ఇప్పుడిలాంటి సంఘటనలు వెలుగుచూడటంతో.. బయట ఏదైనా తాగాలంటేనే చాలామంది భయపడిపోతున్నారు. ఇదిలా ఉంటే, మరుగుదొడ్డి నీళ్లతో షర్బత్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యవహారాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఇకపై రోడ్డు సైడు ఫుడ్ తినాలన్నా, తాగాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ?