Kangana once again comments on Hrithik Roshan. No political party will hire me says Kangana
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ వివాదం నెవర్ ఎండింగ్ స్టోరీలా సాగుతూనే ఉంది. వివాదాల రాణి కంగనా తన పంథాని కొనసాగిస్తూనే ఉంది. హృతిక్ తో ఎఫైర్ కు ప్రయత్నించి కంగనా భంగపడిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్, హృతిక్ రోషన్ వివాదం జాతీయ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇటీవల ఈ వివరం సమసిపోయిందని భావిస్తున్న నేపథ్యంలో కంగనా రనౌత్ తాజగా మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కంగనా, హృతిక్ వ్యవహారం సమసిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో కంగనా రనౌత్ మరో మారు హృతిక్ రోషన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆదివారం జరిగిన రైజింగ్ ఇండియా సమ్మిట్ లో కంగనా రనౌత్ మోడీ నామస్మరణ చేసింది. తాను భారత ప్రధాని నరేద్ర మోడీకి పెద్ద అభిమానిని అని కంగనా తెలిపింది. దానికి కారణం మోడీ సక్సెస్ ఫుల్ జర్నీ అని కంగనా తెలిపింది. తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని కంగనా తెలిపింది. కానీ చాయ్ వాలా నుంచి ఎదిగిన నరేంద్ర మూవీ సక్సెస్ ఫుల్ స్టోరీ గురించి బాగా తెలుసు అని కంగనా తెలిపింది. ఇలాంటి వ్యక్తులనే రోల్ మోడల్స్ గా తీసుకోవాలని కంగనా రైజింగ్ ఇండియా సమ్మిట్ లో తెలిపింది. కంగనా రనౌత్ వివాదాలతో సహవాసం చేయడం అంటే ఇష్టం ఏమో. అందుకే సద్దుమణిగిన వివాదాన్ని కాస్త రైజింగ్ ఇండియా సమ్మిట్ లో రేపే ప్రయత్నం చేసింది. మరో మారు హృతిక్ రోషన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 16 ఏళ్ల ప్రాయం నుంచే తనకు చాల లవ్ ఎఫైర్ కఉన్నాయని తెలిపిన కంగనా రనౌత్ హృతిక్ రోషన్ తో వివాదం తరువాత మరో వ్యక్తిని ప్రేమించకూడదని తాను నిర్ణయించుకున్నట్లు కంగన తెలిపింది.