Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Boney Kapoor, son Arjun bond well. pic goes viral

గతంలో శ్రీదేవి కుటుంబానికి, బోనికపూర్ మొదటి భార్య ఫ్యామిలీకి కనీసం మాటలు కూడా లేవు. అర్జున్ కపూర్ కూడా తండ్రి కుటుంబంతోకలిసే వాడు కాదు. కనీసం తండ్రితో కూడా మాట్లాడేవాడు కాదు. అలాంటిది శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్ చెల్లెళ్లని, తండ్రిని చేరదీస్తున్నాడు.
శ్రీదేవి ఉన్నపుడు ఆమె కుటుంబంతో అర్జున్ కపూర్ మాట్లాడేవాడు కూడా కాదు. కనీసం తండ్రితో కూడా మాటలు లేవని బాలీవుడ్ వర్గాలు అంటుండేవి. అలాంటిది శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్ లో చాలా మార్పు వచ్చింది
తల్లి మరణంతో తల్లడిల్లుస్తున చెల్లెళ్ళని చేరదీయాలని అర్జున్ కపూర్ భవించాడు. అందుకే తన సోదరి అన్షులా తో కలసి తండ్రికి, చెల్లెళ్లకు అండగా నిలిచాడు. శ్రీదేవి అంత్యక్రియల కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాడు.
శ్రీదేవి మరణించ తరువాత నా కొడుకు, కుమార్తె అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిది బోనికపూర్ అర్జున్ కపూర్, అన్షులాని ప్రశంసించిన సంగతి తెలిసిందే.
శ్రీదేవి ఉన్న సమయంలో జాన్వీ, ఖుషి.. అర్జున్ కపూర్ తో కనీసం మాట్లాడేవారు కూడా కాదు. వారి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుభందం అప్పట్లో లేదు. తల్లి మరణం తరువాత అర్జున్ కపూర్ చూపించిన ప్రేమకు జాన్వీ, ఖుషి పొంగిపోయారు. ఇప్పుడు ఎలాంటి బిడియం లేకుండా అన్నతో కలసి మాట్లాడుతున్నారు.
బోనికపూర్ తన కుమార్తెలు ఇద్దరితో గత రాత్రి అర్జున్ కపూర్ నివాసానికి వెళ్లడం విశేషం. తిరిగి వెళ్లే సమయంలో అర్జున్ కపూర్ కరువరకు వచ్చి వారిని సాగనంపి మరి వెళ్ళాడు.

Recommended