NTR’s focus only on films. No more political affairs
సినీ నటుడికి కావలసిన లక్షణాలని అద్భుతంగా ఉన్న నటుడు ఎన్టీఆర్. నటన, డాన్స్ ఆహార్యంతో పాటు ఎన్టీఆర్ కు మంచి వాక్ చాతుర్యం కూడా ఉంది. సినిమాల్లోనే కాకుండా రాజకీయ ప్రసంగాలని సైతం ఎన్టీఆర్ అద్భుతంగా చేయగలడు.ఆ తరువాత క్రమంగా ఎన్టీఆర్ పార్టీకి దూరమై సినిమాలపై దృష్టి సారించాడు. ఈ వార్తలపై ఎన్టీఆర్ సన్నిహితులు స్పందించినట్లు తెలుస్తోంది. టెంపర్ చిత్రం నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మరియు జై లవ కుశ చిత్రాలు వరుస హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు అద్భుతమైన డైలాగ్ డెలివరీ ఉంది. కేవలం సినిమాల్లోనే కాక ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలు కూడా అదరగొట్టగలడు. 2009 ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రసంగాలు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్టీఆర్ రాజకీయాల జోలికి వెళ్ళలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాడు. టీడీపీకి ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ వచ్చిందని ఉహాగానాలు కూడా ఆ మధ్యన వినిపించిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ కు టీడీపీ నుంచి పిలుపు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఎన్టీఆర్ సన్నిహితులు రెస్పాండ్ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ తిరిగి రాజకీయా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశమే లేదని, టిడిపి నుంచి పిలుపు వచ్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని ఎన్టీఆర్ సన్నిహితులు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎలాంటి భాద్యతలు ఇచ్చినా ఎన్టీఆర్ స్వీకరించే ఉద్దేశంలో లేరని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దృష్టి మొత్తం సినిమాలు చేయడం పైనే అని అంటున్నారు.