ఊహించిన ట్విస్ట్ ఇచ్చిన శ్రియ...!

  • 6 years ago
Shriya Saran Marries Russian Boyfriend Andrei . Marriage done at her home only

సెక్సీ చూపుల భామ శ్రీయ శరన్ కు సౌత్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్లో ఎక్కువగా బడా స్టార్స్ తో సినిమాలు చేసిన హీరోయిన్ శ్రీయనే. గత కొంతకాలంగా శ్రీయ రష్యాకు చెందిన ఆండ్రీ కోచీవ్ తో రహస్య ప్రేమాయణం సాగిస్తోంది. తాజాగా శ్రీయ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రష్యన్ ప్రియుడిని తన నివాసంలోనే వివాహం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అందం, అభినయం కలబోసి ఉండడంతో శ్రీయకు స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశం దక్కింది. టాలీవుడ్ లో శ్రీయ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ ఇలా దాదాపుగా అందరు స్టార్ హీరోల చిత్రాలలో నటించి మెప్పించింది
శ్రీయ తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన హవా కొనసాగించింది. రజినీకాంత్ సరసన శివాజీ చిత్రంలో నటించి మెప్పించింది.
శ్రీయ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ ఆటగాడు ఆండ్రీ కోచీవ్ తో చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. శ్రీయ అతడితో సహజీవనం చేస్తున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి
పెళ్లి వార్తలని ఇటీవల ఖండించిన శ్రీయ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ముంబై లోని తన నివాసంలో ప్రియుడిని రహస్య వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది మిత్రుల సమక్షంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
తన పెళ్ళైన విషయాన్ని శ్రీయ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే శ్రీయ సోషల్ మీడియా ద్వారా తన వివాహ వార్తని అభిమానులతో పంచుకునే అవకాశం ఉంది.

Recommended