Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
TTV Dhinakaran's new party called Amma Makkal Munetra Kazhagam with Jayalalithaa's face on flag. The move comes months after Dinakaran won the key RK Nagar Assembly by-poll last December.

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకులను ముప్పుతిప్పలు పెడుతున్న చెన్నైలోని ఆర్ కే నగర్ ఎమ్మెల్మే టీటీవీ దినకరన్ గురువారం కొత్త రాజకీయ పార్టీ ప్రకటించారు. తమిళనాడులోని మదురై జిల్లా మేలూరులో టీటీవీ దినకరన్ కొత్త పార్టీని, జెండాను ఆవిష్కరించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) తన పార్టీ పేరు అని టీటీవీ దినకరన్ ప్రకటించారు. ఇక నుంచి తాను, తన మద్దతుదారులు ఇదే పార్టీ పేరుతో పోటీ చేస్తానని టీటీవీ దినకరన్ అన్నారు.
ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మీద 18 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించిన టీటీవీ దినకరన్ ఇక రాజకీయంగా మరో మొట్టు ఎక్కడానికి సిద్దం అయ్యారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి మెజారిటీ శాసన సభ్యుల మద్దతు లేదని, వెంటనే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చెయ్యాలని టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు.
తమిళనాడులో అధికారంలో ఉన్నా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని ప్రభుత్వాన్ని దించడానికి అవసరమైతే ప్రతిపక్షం డీఎంకేతో కలవడానికి తాము సిద్దంగా ఉన్నామని చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులు ఇప్పటికే బహిరంగంగా చెప్పారు.
నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండా మధ్యలో జయలలిత ఆకారంలో ఉన్న ఓ బొమ్మను టీటీవీ దినకరన్ తన జెండాలో పెట్టారు. అయితే ఆ ఫోటో జయలలితదా లేక చిన్నమ్మ శశికళదా అనే విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

Category

🗞
News

Recommended