Skip to playerSkip to main contentSkip to footer
  • 7 years ago
Angelina Jolie ready for wedding. She is in relationship with London billionaire. She dumped pitt for a married billionaire

హాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఏంజెలినా జోలీ గురించి సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దశాబ్దాల కాలంగా ఏంజెలీనా వెండి తెరపై అభిమానులని అలరిస్తూనే ఉంది. ప్రొఫెషన్ పరంగా ఏంజెలినా జోలీ సూపర్ సక్సెస్ అయింది. కానీ ఏంజెలినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పలేదు. ఏంజెలినా ఇప్పటి వరకు ముగ్గురు భర్తలతో విడిపోయింది. నాలుగో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి లండన్ లో సెటిల్ అవ్వాలనేది ఈ అమ్మడి కోరిక అట. ఇప్పటికే లండన్ బిలీనియర్ ని లైన్ లో పెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఏంజెలినా 1996 లో మొదటి సారి జానీ మిల్లర్ ని వివాహం చేసుకుంది. అతడితో మూడేళ్లకు మించి కాపురం చేయలేదు. 96 లో మిల్లర్ నుంచి ఏంజెలినా విడిపోయింది.
మిల్లర్ నుంచి విడిపోయాక ఏంజెలినా 2000 లో బిల్లీ బాబ్ ని వివాహం చేసుకుంది. ఈ బంధం కూడా మూడేళ్లకు మించి సాగలేదు. 2003 లో అతడి నుంచి విడిపోయింది.
ఆ తరువాత ఏంజెలినా 2014 లో ప్రముఖ నటుడు బ్రాడ్ పిట్ ని వివాహం చేసుకుంది. హాలీవుడ్ లో వీరిద్దరూ హాట్ కపుల్స్ గా కనిపించారు. చివరకు బ్రాడ్ పిట్ నుంచి కూడా ఏంజెలినా 2016 లో విడిపోయింది. వివాహం 2014 లో చేసుకున్నప్పటికీ అంతకు ముందు నుంచే వీరి రిలేషన్ షిప్ మొదలైంది.
ఏంజెలినా ప్రస్తుతం తన ఆరుగురు దత్తత పిల్లలతో ఉంటోంది. లండన్ కు చెందిన ఓ బిలీనియర్ తోఏంజెలినా కొంతకాలంగా రహస్య రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
లండన్ బిలీనియర్ ని త్వరలోనే వివాహం చేసుకోవడానికి ఏంజెలీనా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అతడిని వివాహం చేసుకున్న తరువాత తన పిల్లలతో లండన్ లోనే సెటిల్ కావాలనేది ఏంజెలినా కోరికగా కొన్ని వార్తలు వస్తున్నాయి.

Recommended