Shami's IPl contract is in danger zone regarding alligations he faced by his wife.Dare devils consulting BCCI for leagl advices on shami's contract in ipl..
తన భార్య చేసిన ఆరోపణలతో ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతోన్న టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి.
బుధవారం సాయంత్రం హసీన్ జహాన్ తన న్యాయవాదితో కలిసి కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం షమితో పాటు మరో నలుగురిపై ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు కోల్‌కతాలోని లాల్‌బజార్ పోలీసులు తెలిపారు.