Open Breastfeeding Campaign 'ఓపెన్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌' : లైంగిక కోణంలో చూస్తున్నారా ?

  • 6 years ago
A campaign which promotes free and open breastfeeding among women, as part of the International Women’s Day celebrations.

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళకు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. కేరళను ఒక చైతన్యానికి ప్రతీకగా, విద్యావంతుల గడ్డగా పేర్కొంటుంటారు. ఇటీవలి కొన్ని ఘటనలు ఆ పేరుకు మచ్చ తెచ్చే పనిచేసినప్పటికీ.. కొత్త ఆలోచనలకు కేరళ నుంచి బీజం పడటం ఆగలేదు. అలా మొదలైందే 'ఓపెన్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌'. ఒక మాతృమూర్తి నలుగురిలో తన బిడ్డకు పాలివ్వడానికి ఎందుకు సంకోచించాలి? లేదా తన ఎద భాగాన్ని వస్త్రంతో కప్పుకుని.. భయంగా, బెరుగ్గా ఏదో తప్పు చేస్తున్నట్టు ఎందుకు ఫీలవ్వాలి?.. ఈ ఆలోచనల నుంచి పుట్టిందే 'ఓపెన్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌'.
మలయాళంలో గృహాలక్ష్మి అనే మేగజైన్ 'ఓపెన్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌' క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఇందుకోసం ఓ ప్రత్యేక సంచికను తీసుకొచ్చింది. ఆ సంచిక కవర్ పేజీపై కేరళ నటి, రచయిత అయిన గిలు జోసెఫ్ చిత్రాన్ని ముద్రించింది. ఆ చిత్రలో జోసెఫ్ చంటిబిడ్డకు 'ఓపెన్ బ్రెస్ట్ ఫీడ్' చేస్తూ కనిపించింది.
ఓ తల్లి బిడ్డకు పాలివ్వడమనే అంశాన్ని లైంగిక కోణంలో చూడవద్దని, పబ్లిక్ లోనూ తల్లులు బ్రెస్ ఫీడ్ చేసే స్వేచ్చా వాతావరణం ఉండాలని గృహాలక్ష్మి మేగజైన్ ఎడిటర్ చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి తన భార్య ఓపెన్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న ఫోటో ఒకటి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి చర్చకు పెట్టాడు. ఓపెన్ బ్రెస్ట్ ఫీడ్ పై చర్చ చేయాల్సిందిపోయి.. చాలామంది అతన్నీ, అతని భార్యను బెదిరించారు. ఆ సంఘటనే ఈ క్యాపెంయిన్‌కు స్ఫూర్తినిచ్చిందని ఎడిటర్ తెలిపారు. చీర కట్టుకునే మహిళలు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో.. ఎద భాగంపై ఇంకేదైనా వస్త్రాన్ని కప్పుకుంటారు. కానీ చీర కాకుండా ఇతర దుస్తులు వేసుకునేవారికి ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్‌పై అవగాహన కల్పించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశం అని చెబుతున్నారు.
సినీ నటి, రచయిత్రి గిలు జోసెఫ్‌ కవర్‌పేజ్‌పై కనిపించడం ఇప్పుడో వివాదానికీ కారణమైంది. ఓపెన్ బ్రెస్ట్ ఫీడ్ కాన్సెప్ట్ మంచిదే అయినా.. పెళ్లి కానీ గిలు జోసెఫ్‌ ఫొటోను చనుబాలు ఇస్తున్నట్టుగా ముద్రించడంపై కొత్తమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందేమో ఇది కేవలం సంచలనాల కోసం, మేగజైన్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మేగజైన్‌ పబ్లిషర్స్‌తో పాటు గిలు జోసెఫ్‌ జోసెఫ్‌పై కొల్లంలో కేసు కూడా నమోదైంది. చూడాలి మరి మున్ముందు 'ఓపెన్ బ్రెస్ట్ ఫీడ్'పై సమాజం ఎలా స్పందిస్తుందో!