Pawan Kalyan's JFC Final Report On Centre's Aid To AP
  • 6 years ago
It is said that Jana Sena chief Pawan Kalyan lead JFC has a conclusion on the assisstance extended to Andhra Pradesh by PM Narendra Modi's Union government.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జెఎఫ్‌సి ఊరటనిచ్చే అవకాశం ఉంది. సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జెఎఫ్‌సి) కేంద్రం రాష్ట్రానికి అందించిన సాయంపై నివేదికను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
ఎంతో సాయం చేశామని కేంద్రం చెబుతుండా, చేయాల్సినంత చేయలేనది రాష్ట్రం అంటోంది, ఇందులో వాస్తవమేమిటో తేలుస్తామని జెఎఫ్‌సి చెప్పి అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించింది. తుది మెరుగులు దిద్ది నివేదికను శనివారంనాడు విడుదల చేసే అవకాశం ఉంది. విభజన తర్వాత సమస్యల నుంచి రాష్ట్రం బయటపడడానికి కేంద్రం ప్రత్యేకంగా అందించిన సాయం ఏమీ లేదని పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జెఎఫ్‌సి తేల్చినట్లు సమాచారం. విభజన చట్టంలోని హామీలను రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ చేసిన ప్రత్యేక హోదా కల్పన వంటివి ఏవీ సక్రమంగా అమలు కాలేదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
చివరకు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రాష్ట్రానికి తగిన సాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీ కూడా సక్రమంగా అమలు కాలేదని జెఎఫ్‌సి అభిప్రాయపడినట్లు సమాచారం.
విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను పేరాలవారీగా కమిటీ సభ్యులు పరిశీలించారు. ఏ పేరా కింద ఏ అంశాలను పొందుపరిచారు, వాటి అమలుకు ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అనే విషయాలను పరిశీలించి, లెక్కలను మదింపు చేసినట్లు తెలస్తోంది.
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జెఎఫ్‌సి ప్రజల ముందు పెట్టే నివేదక బిజెపికి షాక్ ఇస్తుందని, చంద్రబాబుకు ఊరటనిస్తుందని అంటున్నారు. ఆ నివేదిక చంద్రబాబు వాదనకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.



Recommended