NatWest Series : Mohammad Kaif Called ‘Bus Driver’ | Oneindia Telugu
  • 6 years ago
Former cricketer Mohammad Kaif on Tuesday recalled the 2002 NatWest Series and revealed that he was called 'bus driver' by former England cricket team captain Nasser Hussain at the final of the tournament..

ఇటీవల కాలంలో క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది మాములు అయిపోయింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతను మాటలతో దెబ్బతీయడాన్నే స్లెడ్జింగ్ అంటారు. 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ జట్టు కెప్టెన్ తనను బస్సు డ్రైవర్ అంటూ స్లెడ్జింగ్‌ చేసినట్లు టీమిండియా వెటరన్ క్రికెటర్ మహమ్మద్‌ కైఫ్‌ తెలిపాడు. తాజాగా కైఫ్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ ఆటగాడు ఎవరైనా స్లెడ్జింగ్‌ చేశారా? అని అడగ్గా.. 'ఔను.. నాసిర్‌ హుస్సేన్‌ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఆ సమయంలో నన్ను అతడు బస్‌ డ్రైవర్‌ అని పిలిచాడు. దీంతో నేను, యువరాజ్‌ సింగ్‌ కలిసి మ్యాచ్‌ అనంతరం రైడ్‌కు తీసుకెళ్తాం అని దీటుగా బదులిచ్చాం' అని కైఫ్ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
2002లో నాట్‌వెస్ట్ టోర్నీ పైనల్ ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ ఫైనల్స్‌లో భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టం అని అనుకున్నారంతా.
అయితే, అంతటి భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు చక్కటి శుభారంభాన్నిచ్చారు. అయితే గంగూలీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్‌లు నిలకడగా ఆడి భారత్‌కు విజయాన్ని కట్టబెట్టారు.వీరిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో నాట్ వెస్ట్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది.
Recommended